జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి:
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గెలిస్తే నియోజకవర్గ మరింత అభివృద్ధి చెందుతుందని ఇంగ్లి రామారావు అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు శ్రీరామనవమి రోజు వచ్చి దర్శనం చేసుకొని ఇల్లందకుంట మండలంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి 2 లక్షల విరాళం అందజేసినందుకుగాను మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు వెలిచాల రాజేందర్ రావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. జూన్ 4వ తారీఖున కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలువాలని మన కరీంనగర్ పార్లమెంట్ కూడా గెలిస్తే మన హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి మరిన్ని నిధులతో దేవస్థానం కూడా అతి సుందరరంగా తీర్చి దిద్దుకోవచ్చని అన్నారు. మరిన్ని నిధులు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం కూడా చేస్తానని తెలియజేశారు.