
మల్కాజిగిరి, నేటిధాత్రి:
మల్కాజిగిరి నియోజకవర్గం, మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని వెస్ట్ శ్రీకృష్ణ నగర్ లో శుక్రవారం స్థానిక బిజెపి కార్పొరేటర్ శ్రావణ్ పలువురు కాలనీ వాసులు, మహిళలతో సమావేశం నిర్వహించి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ ఈటల గెలుపుతో మల్కాజిగిరి లో మరిన్ని ప్రజా సమస్యలు పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందిఅని తెలిపారు.కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డా. నర్సింహా గౌడ్, డి ఎన్ వెంకటేష్, శరత్ యాదవ్, మురళి యాదవ్, శ్రీరామ్ యాదవ్, కాలనీ అధ్యక్షులు మరియు సభ్యులు రామకృష్ణ, నర్సింగ్ రావు, బాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.