ఎవరైనా సరే ఆధారాలు ఉంటే నిజ నిర్ధారణ చర్చకు సిద్ధం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపిటిసి రాము మాట్లాడుతూ. నేను పార్టీలు మారిన ప్రజల సంక్షేమం కోసం మారిన కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు .నేను తప్పు చేశానని ఆధారాలు ఉంటే తీసుకురండి చర్చకు సిద్ధంగా ఉన్నాను సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షసానందo పొందాలని కుట్రలు మానుకోవాలని నిజా నిజాలు తెలుసుకొని రుజువు చేయాలని ఆధారాలు ఉంటే చర్చకు రావాలని వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియా వేదిక గా పోస్టులు పెట్టడం నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తానని పరువు నష్టం దావా వేసి న్యాయపోరాటం చేస్తానని నా గురించి నా గ్రామ ప్రజలకు నా గురించి తెలుసు తెలుసు అని. మీ ప్రభుత్వ హాయంలో పేదలు ప్రజల భూములను అన్యాయం గుంజుకొని ఇబ్బందులు పెట్టింది మీరు కాదా. మరోసారి నాపై అసత్య ఆరోపణ చేస్తే సహించేది లేదు ఇకనైనా నేను తప్పు చేశానని ఆధారాలు ఉంటే తీసుకురండి ఎక్కడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను తప్పుడు ఆరోపణలు మానుకోవాలని తమపై ఆరోపణలు చేసిన వారికి తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మండల బీసీ సెల్ ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్ హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్ భరత్ గౌడ్ జలంధర్ రెడ్డి చరణ్ యాదవ్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు