
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం సారం పల్లి గ్రామానికి చెందిన సంచుల కుమారస్వామి భూ అక్రమ భూమిని తిరిగి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన సంచుల కుమారస్వామి గ్రామ సర్వేనెంబర్ 464 లో గల మూడెకరా ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నారని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తాను కబ్జా చేసి సాగు చేస్తున్న భూమిని తిరిగి అప్పజెప్పడానికి నిర్ణయించి ప్రభుత్వానికి ఇచ్చేశారని జిల్లాలో ఎవరైనా భూ అక్రమణాల పాల్పడి ఉంటే సదురు భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని ఈ భూములను పేద ప్రజలకు సంక్షేమం కోసం ఉపయోగిస్తామని పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు అలాగే 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతుబంధు పీఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ ఆదేశించారుజిల్లాలో దాదాపు 250 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారుభూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టంగా తెలియజేశారు ఇకనైనా భూ అక్రమదారులు ఉంటే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి పై అధికారులకు అప్పజెప్పాలని ఈ సందర్భంగా తెలియజేశారు