
డీజెఎఫ్ జిల్లా అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి
ప్రెస్ క్లబ్ సమస్యను వ్యక్తిగత సమస్యగా చూడరాదు….
క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పి గట్టయ్య
రామకృష్ణాపూర్, మార్చి 23, నేటిధాత్రి:
డిజేఎఫ్ సభ్యుడిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని డిజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కే పాఠశాల ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్వతి రాజిరెడ్డి మాట్లాడుతూ.. కలువల శ్రీనివాస్ అనే మార్పు దినపత్రిక విలేఖరి డి. జే .ఎఫ్. సభ్యుడైన కొండ శ్రీనివాస్ ను బెదిరించడం సరికాదని అన్నారు. ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి సమస్యను వ్యక్తిగతంగా తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రెస్ క్లబ్ సమస్య విషయం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పటికీ డి జె ఎఫ్ సభ్యుడుని బెదిరించడం సమంజసం కాదని అన్నారు. బెదిరింపు చర్యలు ఇలాగే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా డీజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.అనంతరం క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, డిజేఎఫ్ జిల్లా నాయకులు పిలుమాల్ల గట్టయ్య మాట్లాడుతూ…. ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శి కొండా శ్రీనివాస్ ను మార్పు దినపత్రిక విలేఖరి కలువల శ్రీనివాస్ బెదిరించడం సరియైన పద్ధతి కాదని అన్నారు. ప్రెస్ క్లబ్ సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప దుందుడుకు చర్యలకు పాల్పడరాదని అన్నారు. బెదిరింపు చర్యలు ఇలాగే కొనసాగితే ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని అన్నారు. డిజేఎఫ్ సంఘం విలేకరుల హక్కుల కోసం ఏర్పాటు చేసిన సంఘమే తప్ప పబ్బం గడుపుకునే సంఘం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డి జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్, డి జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్, జిల్లా కోశాధికారి సతీష్, జిల్లా అధికార ప్రతినిధి ఆనపర్తి కుమార్, నాంపల్లి గట్టయ్య, మోరే రవీందర్, నెల్లూరి శ్రీనాథ్, రామస్వామి , ప్రసాద్, ఈశ్వర్, గంగులు, పాల్గొన్నారు