గణపురం నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో దేవుళ్ళ విగ్రహాలు బయటపడ్డాయి వివరాల్లో కి వెళ్తే గణపురం మండలంలోని మైలారం గ్రామం లో మల్లన్న గుట్టపై మల్లన్న స్వామి ఆలయానికి రోడ్డు మార్గం కోసం పనులు చేస్తుండగా రేణుక ఎల్లమ్మ తల్లి లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు వెలుగు చూశాయి ఈ విషయం తెలియగానే గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులు వారు తరలివచ్చి గ్రామ పెద్దలు ప్రముఖులు మేధావులు పిల్ల పాపలతో విగ్రహాలను చూసి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు జరిపించినారు