ఎండపల్లి, నేటి ధాత్రి
ఉపాధి హామీ పనుల్లో విగ్రహాలు బయటపడి , భక్తులు తరలి వచ్చిన సంఘటన చోటు చేసుకుంది , ఎండపల్లి మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీలు గురువారం ఎల్కలదేవి గుట్టకు కందకాలు తవ్వుతుండగా, శివుడు,హనుమాన్ గదా ,పోచమ్మ దేవుళ్ళను పోలిన విగ్రహాలు బయటపడ్డాయని సుమారుగా 15 విగ్రహాలు వరుసగా బయల్పడినట్లు ఉపాధి హామీ సహాయకులు అసిస్టెంట్ జుంజుపెల్లి సురేష్ తెలిపారు. కాగా ఈ విగ్రహాలకు ఉపాధిహామీ కూలీలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు.