Recognition Unions Failed Singareni Workers
సింగరేణి కార్మికులకు అన్యాయం చేసిన గుర్తింపు సంఘాలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో కార్మిక సంఘాలు గుర్తింపు సంఘంగా గెలుపొందాయి కానీ సింగరేణి కార్మికులకు రెండు సంవత్సరాలలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు కార్మికులకు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను ఏ ఒక్కటి నెరవేర్చలేదు
సింగరేణిలోడిసెంబర్ 27న గుర్తింపుసంఘం రెండు సంవత్సరాలకాలపరిమితి అయిపోతుందికనుకతిరిగి లేబర్ కమిషనర్ సింగరేణిలోగుర్తింపు సంఘంఎన్నికలుత్వరగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం
సింగరేణిలో కార్మిక సంఘాలు రెండు సంవత్సరాలు కాలయాపన చేసి కార్మికులకు ద్రోహం చేశారు సింగరేణి కార్మికులకు ఇంటి స్థలం 200 గజాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఇన్కమ్ టాక్స్ మాఫీ చేయలేదు

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇవ్వలేదు అలాగే మారుపేరులను మార్చి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పిస్తామన్నారు కానీ ఏ ఒక్కరికి ఉద్యోగం ఇప్పించలేదు సింగరేణి సంక్షేమానికి ఏ ఒక్క అభివృద్ధి పనులు చేయలేదు
డిస్మిస్ అయిన కార్మికుల కుటుంబాలను వీధి పాలు చేశారు ఒకరి కూడా ఉద్యోగం ఇప్పించలేదు
సింగరేణి కార్మికులకు పనిముట్లు కానీ నిత్యవసర సరుకులు గాని ఏ విషయాన్ని మాట్లాడకపోవడం చర్చనీయం సింగరేణి కార్మికుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది అని వారు డిమాండ్ చేశారు
సింగరేణిలోనికార్మిక సంఘాలుసమిష్టిగా గుర్తింపుసంఘంఎన్నికలు నిర్వహించేంతవరకు ఐక్యంగాఉద్యమించాలని
ఏఐఎఫ్ టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
