బార్ అసోసియేషన్ తీర్మానoను వక్రీకరించారు..
బార్ అసోసియేషన్ కార్యవర్గం..
పలమనేరు బార్ అసోసియేషన్ లో మంగళవారం జరిగిన అంతర్గత విషయాలను, తీర్మానాలను కొందరు వాస్తవాలను వక్రీకరించి మీడియా మిత్రులకు అందజేశారని, అందులో వాస్తవం సుదూరంగా ఉందని పలమనేరు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఖండిస్తూ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాస్తవంగా మంగళవారం బార్ అసోసియేషన్ సభ్యులు సమావేశమై తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యుడు ఏ. రాజశేఖర్ పై పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన హత్యాయత్నంపై చర్చించి తీవ్రంగా ఖండించడం జరిగింది. సదరు సంఘటనపై ఖండిస్తూ తీర్మానించిన అనంతరం ఒక బార్ సభ్యుడు ఒక కోర్టు కానిస్టేబుల్ వ్యవహారంపై చర్చించాలని కోరారు. సదరు విషయంపై చర్చించి కోర్టు కానిస్టేబుల్ విషయంపై స్థానిక డిఎస్పి కి ఒక తీర్మానం ద్వారా అందజేయాలని నిర్ణయించాము. ఆ ప్రకారం సభ్యుల ఏకాభిప్రాయంతో ఒక తీర్మానాన్ని ఆమోదించాము.సదరు బార్ అసోసియేషన్ తీర్మానం ను బుధవారం అనగా ఈరోజు స్థానిక డిఎస్పి కి అందించి సమస్య పై ఆయనతో చర్చించాలని తీర్మానించాం. అయితే కొందరు పై విషయాలను వక్రీకరించి ప్రింట్ మరియు సోషల్ మీడియా మిత్రులకు అందజేయడం ఆ వార్తలు వైరల్ అవ్వడంతో బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా మనస్థాపం చెంది సదరు వక్రీకరణ విషయంను ఖండిస్తున్నాం.
ఒకరిద్దరూ న్యాయవాదులు ఒకరిద్దరూ కోర్టు కానిస్టేబుల్స్ మధ్య జరిగిన వ్యవహారాలను మొత్తం బార్ అసోసియేషన్ సభ్యులకు మరియు పోలీసు వ్యవస్థకు మధ్య దూరాన్ని పెంచడానికి కొందరు ప్రయత్నించారని స్పష్టం అవుతోoది. ఇందులో కార్యవర్గ సభ్యుల ప్రమేయం కానీ అందరు న్యాయవాదులు ప్రమేయం కానీ లేదని స్పష్టం చేస్తున్నాము. ఈ మేరకు బుధవారం స్థానిక డిఎస్పీ డేగల ప్రభాకర్ ను కలిసి బార్ అసోసియేషన్ లో తీర్మానం చేసిన కాపీలను అందజేసి వాస్తవాలను వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్.భాస్కర్,
వి.చంద్రశేఖర్, సహ కార్యదర్శి జి.ఆ జి.ఆర్. రవి,
న్యాయవాదులు కె.జగదీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
