నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
ఈనెల 20 న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ 14 అండర్ 17 ఇయర్స్ రెజ్లింగ్ పోటీలు హనుమకొండ జే ఎన్ ఎస్ స్టేడియంలో జరిగాయి.ఈ పోటీల నిర్వహణలో భాగంగా దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ బ్రాంచ్ కి చెందిన ఐదుగురు క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికైనారు. ఎంపికైన క్రీడాకారులు 35 కేజీల విభాగంలో చొప్పరి రామ్ చరణ్,48 కేజీల విభాగంలో
ఆకుల సాయి తేజ, 62 కేజీల విభాగంలో ఎంబడి అజయ్, 68 కేజీల విభాగంలో ఎంబడి అక్షయ్,65 కేజీల విభాగంలో కొండ్లె రుత్విక్ రాష్ట్రస్థాయికి ఎంపికైనారు. ఎంపికైన క్రీడాకారులు, కోచ్ ఇటికాల దేవేందర్ ను చైర్మన్ రవి అభినందించారు. అలాగే రాష్ట్రస్థాయిలో మంచి పేరు తీసుకురావాలని క్రీడలు ఆడడం వలన శారీర దృఢత్వాన్ని మానసిక ఉల్లాసాన్ని మానసిక స్థితి మెరుగుపడుతుందని మానసిక ఒక్తుడులను అలాగే భవిష్యత్తులో గెలుపు ఓటములను అనుభవించిన వ్యక్తి ఏ సమస్యలు వచ్చిన తట్టుకోగల శక్తి ఒక క్రీడాకారులకు మాత్రమే ఉంటుందని తెలియజేశారు ఎంతటి సమస్యనైనా ఒక క్రీడాకారులు మాత్రమే తేలికగా తీసుకుంటారని క్రీడలలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులుకి పోటీ పరీక్షలకు సైతం ఉద్యోగరీత్యా స్థిరపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని తెలియజేశారు.అలాగే రాష్ట్రస్థాయిలో వరంగల్ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని శ్రీ ఆదర్శవాణి క్రీడాకారులను సూచించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బిక్షపతి, ప్రిన్సిపాల్ మణికంఠ,కోచ్ ఇటికాల దేవేందర్,పిఈటీలు పాషా, విజయ్, సందీప్, చైతన్య,చందన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.