
దుగ్గొండి,నేటిధాత్రి :
గత నెల 30 న జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ 14,17 బాలికల రెజ్లింగ్ పోటీలు నిర్వహించగా ఈ పోటీలలో దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.ఎంపికైన క్రీడాకారులను శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పాఠశాల నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు సల్గరి అపర్ణ 58 కేజీలు, లేంకాల వర్ష 46 కేజీల విభాగంలో జిల్లాలో మొదటి స్థాయిలో నిలిచారు. క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేసి శాలువులతో సన్మానించినట్లు తెలిపారు. ఆటలలో ఎప్పుడు ముందుండాలని, ఆటలు ఆడడం వలన మానసిక స్థితి మెరుగు పడుతుందని అలాగే ఆలోచన చురుకుదనం పెరుగుతుందని వివరించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీర దృఢత్వాన్ని కలిగి ఉంటారని అలాగే విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని వరంగల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను సూచించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బిక్షపతి, ప్రిన్సిపాల్ మణికంఠ రవి కోచ్ ఇటికాల దేవేందర్ పీటీలు, అంజద్ పాష, విజయ్, సందీప్, చైతన్య, ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు