రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆదర్శవాణి విద్యార్థులు.

నర్సంపేట,నేటిధాత్రి :

ఈనెల 10వ తేదీన జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలలో దుగ్గొండి మండల కేంద్రంలో గల శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ కు చెందిన విద్యార్థులు పలు ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడిల్స్, బ్రౌన్సు మెడల్స్ సాధించారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులు 60 మీటర్స్ రన్ లో ఏ.సాయి తేజ అండర్ 14 లో గోల్డ్ మెడల్ ,పి.శివ అండర్ 8 ఇయర్స్ బ్రాడ్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించారు.అలాగే జావలిన్ త్రో పోటీల్లో పి.సుసన్న సిల్వర్ మెడల్,100 మీటర్ల పరుగు పందెంలో
టీ.బ్రాను ప్రసాద్ బ్రౌన్జ్ మెడల్ ,
60 మీటర్స్ పరుగు పందెంలో సాయి చరణ్ బ్రాంచ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో శ్రీ అదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగన బోయిన రవి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని క్రీడలు ఆడడం వలన మానసిక ఉల్లాసం ఉత్సాహం శారీర దృఢత్వం కలిగి ఉంటారని పేర్కొన్నారు. చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని క్రీడల వలన కూడా గ్రూప్ -1,గ్రూప్-2 ఉద్యోగాలలో అవకాశాలు ఉంటాయని ఎందుకు ఉదాహరణ ఇటీవల కాలంలో దీప్తి జివాంజి ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన క్రీడాకారులు దీప్తి జివాంజి ని గ్రామం మారుమూల గ్రామమేనని ఆ గ్రామంలో నుండి జాతీయస్థాయి అంతర్జాతీయ స్థాయి ఒలంపిక్ లో తీసుకొచ్చిన ఘనత ఉందని ఇలాంటి వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ రవి విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బిక్షపతి, ప్రిన్సిపాల్ మణికంఠ రవి,పిఈటిలు అంజాద్ పాషా, మహేందర్, సందీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *