జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఆదర్శవాణి విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి :

ఈనెల 7 8 తేదీలలో హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన శ్రీ ఆదర్శవాణి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైనారు.ఈ సందర్భంగా శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి పాఠశాల అధ్యాపకులతో కలిసి వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయికి ఎంపికైనందుకు విద్యార్థులను శాలువులతో సన్మానించారు.అనంతరం చైర్మన్ రవి మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు గ్రీకో రోమన్ స్టైల్ లో ఎం భరత్ గోల్డ్ మెడల్ ,ఎన్ సిద్దు సిల్వర్ మెడల్,
సిహెచ్ కృతిక సిల్వర్ మెడల్,
పి సుసన్న బ్రౌన్స్,
కే రితిక్ బ్రౌన్స్ మెడల్స్ సాధించారని తెలియజేశారు. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 28, 29 తేదీలలో మధ్యప్రదేశ్ లోని గ్యాలియర్లో జరుగు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని చైర్మన్ తెలిపారు.మా పాఠశాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయస్థాయిలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని, జాతీయస్థాయి సర్టిఫికెట్ పై చదువులకు ఉద్యోగారీత్యా స్థిరపడేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని సూచించారు క్రీడాకారులు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని శారీర దృఢత్వం కలిగి ఉండడానికి తోడ్పడుతుందని ప్రతి ఒక్క విద్యార్థి క్రీడ స్ఫూర్తిని కలిగి ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బుచ్చన్న, ప్రిన్సిపాల్ శశిధర చారి, సుధాకర్, రవి, ఏవో రమేష్, పిఈటిలు కార్తీక్, దేవేందర్,పాషా,శ్రీధర్, రంజిత్, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *