
Gorrekunta ZPHS School
స్నేహితుల దినోత్సవం రోజున ఆదర్శంగా నిలిచిన స్నేహితులు.
స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహకారం
కాశిబుగ్గ నేటిధాత్రి
స్నేహితుల దినోత్సవం అంటే ఎక్కడెక్కడో దూరంగా ఉన్న స్నేహితులు ఒక్కచోట కలుసుకొని పార్టీలు చేసుకోవడం మనందరికీ తెలిసిందే. కానీ గొర్రెకుంట జెడ్పిహెచ్ఎస్ పాఠశాల లో 2003-04 చెందిన పదవ తరగతి విద్యార్థులు నిజమైన స్నేహితుల దినోత్సవం రోజు అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ గుర్తుండేలా చేశారు. ఆదివారం రోజున ఈ స్నేహితులు చేసిన తీరును ఈ రోజు గొర్రెకుంట తోపాటు జిల్లాలోనే స్నేహితులందరికీ మార్గదర్శకంగా నిలిచిందని చెప్పవచ్చు. వివరాల్లోకెళితే గొర్రెకుంట
కు చెందిన ఎర్రం వీరస్వామి(స్వామి) గత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా వారి స్నేహితులు అయినటువంటి 2003-04 ఎస్ఎస్ సి బ్యాచ్ కు చెందిన మిత్రులు ఆయన కుటుంబానికి ముప్పైనాలుగు వేల ఐదు వందల రూపాయలను (34,500)స్నేహితుల దినోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం దొరికింది.కాగా మృతి చెందిన వీరస్వామికి భార్యతోపాటు కొడుకు కూతురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.