
జైపూర్, నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూల్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్. కవిత బుధవారం రోజున సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలలో వయసుతో సమానంగా కావాల్సిన అవసరమైన ఎదుగుదలని బరువు మరియు ఎత్తు కొలతలను చూసి తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. పిల్లలు చేసిన ఫ్రీ స్కూల్ కార్యక్రమాలను పరిశీలించి అవసరమైనటువంటి సూచనలను తెలియజేయడం జరిగింది. వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పాటించవలసిన ఆహార నియమాల గురించి, వడదెబ్బ నుంచి రక్షించుకోవాల్సినటువంటి నియమాలను గురించి, అలాగే కావాల్సినటువంటి పోషక విలువలతో కూడిన ఆరోగ్య పౌష్టికాహారం గురించి పిల్లలకు వారి తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. అలాగే అంగన్వాడి టీచర్లకు ఆయాలకు బాలింతల పట్ల, పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్ .కవిత, అంగన్వాడి టీచర్లు, బాలింతలు, పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.