
ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయని ఐసీడీసీ సూపర్వైజర్ సద్గుణ అన్నారు.తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో సోమవారం మొగుడంపల్లి మండలంలో అంగన్వాడి టీచర్ ఎస్.తుల్జమ్మ ఆధ్యక్షతన అంగన్వాడి సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు.శిశువు పుట్టిన దగ్గర నుంచి రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు పట్టించాలన్నారు.తల్లిపాలు బిడ్డ మానసిక,శారీరకంగా ఎదుగులకు ఉపయోగపడతాయన్నారు.చాలా మంది తల్లులు పిల్లలకు తేనె,నీళ్లు వంటివి పడుతుంటారని,అలా చేయడం వల్ల బిడ్డ అనారోగ్యానికి గురవుతారన్నారు.రెండేళ్ల నుంచి బిడ్డకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని సూపర్వైజర్ సద్గుణ పేర్కొన్నారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ పరిధిలోని గర్భిణులకు మంగళవారం సీమంతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరూప,ప్రవీణ, అంగన్వాడి టీచర్ తుల్జమ్మ, ఆశ వర్కర్లు యశోద, ప్రకృత,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.