
Ibrahimpatnam Karate Students Win Gold at State Championship
రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో పథకాలు సాధించిన ఇబ్రహీంపట్నం కరాటే విద్యార్థులు.
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
రెవెన్యూ గార్డెన్ కరీంనగర్ జిల్లా లో ఇంటర్నేషనల్ షావోలిన్ కుంగ్ ఫూ బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆర్గనైజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ రాష్ట్ర స్థాయి కుంగ్ ఫూ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో జె.కె.ఏ ఇండియా షోటోకాన్ కరాటే అసోసియేషన్ జగిత్యాల జిల్లా నుండి 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ఇబ్రహీంపట్నం కు చెందిన ఇద్దరు కరాటే విద్యార్థులు కటాస్ విభాగంలో ప్రథమ స్ధానంలో సాయితేజ, రిశ్వంత్ లు బంగారు పథకాలు సాదించారు. అనంతరం టోర్నమెంట్ ప్రధాన జడ్జ్ రాజమల్లు మాస్టర్,ఆర్గనైజర్ శ్రీనివాస్ గార్ల చేతులమీదుగా విద్యార్థులకు పథకాలు, ప్రశంసా పత్రాలు అందజేసారు. వివిధ జిల్లాల నుండి 400 మంది కరాటే విద్యార్థులు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారని జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, వాగ్దేవి డిగ్రీ కళాశాల చైర్మన్ కృష్ణ, డ్రాగన్ స్వార్ద్ కుంగ్ ఫూ గ్రాండ్ మాస్టర్ రాజమళ్లు, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీనివాస్, ప్రభాకర్ జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్, కరాటే మాస్టర్లు నవీన్, విశ్వ తేజ కరాటే విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.