Support for Defeated Candidates in Narsampet Elections
ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా
ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పరామర్శ
నిరాశ చెందొద్దు..ఓడిపోయిన.. విజేతలు మీరే..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
దుగ్గొండి నేటిధాత్రి:
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా
బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు భారత్ రాష్ట్ర సమితి పార్టీతో పాటు నేను అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ధైర్యం నింపేందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శ యాత్ర చేపట్టారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి, తొగర్రాయి,తిమ్మంపేట, మహమ్మదాపురం,మర్రిపల్లి ,వెంకటాపురం గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమిపాలవగా
ఆయా గ్రామాల అభ్యర్థులను పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ ఓటమి చెందిన అభ్యర్థులకు పార్టీలో భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
* ప్రజాసేవయే లక్ష్యం ఇదే పోరాట స్ఫూర్తితో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారని పిలుపునిచ్చారు.

అధికార దుర్వినియోగం అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, అధికారులు చాలా చోట్ల బిఆర్ఎస్ విజయాలను తారుమారు చేశారని మండిపడ్డారు.కొన్నిచోట్ల ఎన్నికల ఫలితాలపై కోర్టులో సవాల్ చేస్తామని, న్యాయపరంగా, చట్టబద్ధంగా పోరాడి గెలుస్తామని స్పష్టం చేశారు.పోలీసుల అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫలితాలను తారుమారు చేసినా కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరంలేదని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్నికలలో ఒకటి ముపాయలైన నిరాశ చెందకుండా ఉండాలని అయినా ఓటమి చెందిన మీరే విజేతలు అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధైర్యం చెప్పారు.
ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వర్ రావు,,మాజీ మార్కెట్ ఛైర్మెన్ పొన్నం మొగిలి,మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, బిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, సర్పంచ్ శంకేసు కమలాకర్,మండల సీనియర్ నాయకులు,క్లస్టర్ బాధ్యులు, సర్పంచ్ లు.ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు ,మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
