
Vaibhav Suryavanshi
డబుల్ సెంచరీ కొట్టి తీరుతా.. ఇంగ్లండ్‌కు సూర్యవంశీ వార్నింగ్!
ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. డబుల్ సెంచరీతో విరుచుకుపడతానని హెచ్చరించాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
14 ఏళ్ల వయసులోనే స్టార్డమ్ సంపాదించాడు వైభవ్ సూర్యవంశీ. అండర్-19లో ఆడుతూ వెలుగులోకి వచ్చిన ఈ యువ బ్యాటర్.. ఐపీఎల్-2025తో ఓవర్‌నైట్ స్టార్‌గా అవతరించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన సూర్యవంశీ.. 7 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 252 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది పాత రికార్డులకు పాతర వేశాడు. అక్కడితో ఆగని వైభవ్.. ఇంగ్లండ్ టూర్లో భారత అండర్-19 జట్టుకు ఆడుతూ 52 బంతుల్లోనే మెరుపు శతకం బాదాడు. 10 ఫోర్లు, 7 సిక్సులు బాదిన సూర్యవంశీ.. 78 బంతుల్లో 143 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అలాంటోడు ప్రత్యర్థులకు మరోమారు హెచ్చరికలు జారీ చేశాడు. ఇంతకీ వైభవ్ ఏమన్నాడంటే..