“నేటిధాత్రి”, హనుమకొండ.
విశ్వకర్మల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ లోని కీర్తి గార్డెన్స్‌లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. విశ్వకర్మ భగవాన్ పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల స్వర్గస్తులైన విశ్వబ్రాహ్మణులకు సంతాపం తెలియజేశారు.
ఈ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని వివరించారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు బిక్షపతి చారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ కుల వృత్తులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. వృత్తి భద్రత కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. 50 సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణులకు పెన్షన్ కల్పించాలన్నారు. విశ్వబ్రాహ్మణ వృత్తికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి,పాలక మండలి నియామకం చేయాలన్నారు.
ప్రభుత్వం స్పందించకంటే ఉద్యమ బాట పెడతామనే హెచ్చరించారు.
విశ్వబ్రాహ్మణ కులబంధువుల అభిప్రాయాలను సేకరించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణుల హక్కుల సాధన కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ, జాతి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సమావేశానికి హాజరైన మానుకోట మాజీ శాసనసభ్యులు బండి పుల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నౌండ్ల సంతోష్ చారి, రాష్ట్ర కార్యదర్శి కల కోటి శ్రీధర్, నందిపేట రవీంద్ర చారి, తల్లోజు చెన్నయ్య చారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారం భాస్కరాచారి,మాటూరు రమేష్ చారి (వరంగల్ జిల్లా),ములుగు జిల్లా మహిళా నాయకురాలు శ్రీమతి గుంటోజు పావని మేడారం సమ్మక్క సారవమ్మ జాతర కమిటీ డైరెక్టర్, శృంగారపు వెంకటేశ్వర చారి (హనుమకొండ),
పాములపర్తి వేణుగోపాల చారి (కరీంనగర్),
బండోజు ఉపేంద్ర చారి (మహబూబాబాద్),
సతీష్ చారి (భూపాలపల్లి),
రాజన్న చారి (ములుగు),
సాయి అన్న గారి శ్రీనివాస చారి (సిద్దిపేట),
గోపాల చారి (సిరిసిల్ల),
భీమోజు సురేంద్ర చారి (పెద్దపల్లి),
మట్టల రమేష్ చారి (మంచిర్యాల),
శ్రీరామోజు భాస్కరాచార్య (కొమురం భీం ఆసిఫాబాద్),
భాష పెళ్లి రమేష్ చారి (మేడ్చల్)
రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
