మీ సేవకుడిగా ఉంటా..వెంకటరామిరెడ్డి

మెదక్ ఎంపి అభ్యర్థి వెంకట్ రామా రెడ్డికి మద్దతుగా నర్సాపూర్ నియోజకవర్గం, డౌల్తాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్…

తెలంగాణ భవిష్యత్తుకు జరుగుతున్న ఎన్నికలు ఇవి.

కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నిక కాదు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది. ఎన్ని హామీలు అమలు చేసింది.

2 లక్షల రుణమాఫీ చెయ్యలేదు.
రైతు బంధు 10 వేలు చెయ్యలేదు


కల్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు.
4000 పింఛన్లు ఇవ్వలేదు.


పంటకు 500 బోనస్ అన్నారు

మదన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ లో చేరారు.
రైతులను రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు కాంగ్రెస్ లో కలిశావా..

పంట కొనుగోలు ఎందుకు చెయ్యడం లేదు.
రైతుల జీవితాలతో ప్రభుత్వం ఎందుకు ఆడుకుంటున్నది.

కాంగ్రెస్ ను నిలదీయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కారును గెలిపించాలని కోరుతున్నా.

గుంపు మేస్త్రి గూబ పగిలేలా తీర్పు ఇవ్వాలి.

కాంగ్రెస్ హామీలు మాట తప్పింది.
బాండ్ పేపర్ బౌన్స్ అయ్యింది. వారికి శిక్ష పడాల్సిందే.

రేవంత్ రెడ్డి బిజెపి తో చేతులు కలిపాడు.

బిజెపి ధరలు పెంచింది. జీఎస్టీ పెంచింది.
గ్యాస్ ధరలు పెంచింది కెసిఅర్.

రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చింది.

కేసీఆర్ గారూ ప్రజల తరుపున హామీల గురించి నిలదీస్తే.

కేసీఆర్ నీ చెడ్డి ఊడగొడుతా అంటున్నాడు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలా అంటారా

చెప్పుతో రైతులను కొడుతా అన్నందుకు మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిండా

కష్టకాలంలో కేసీఆర్ ను వదిలిపెట్టడం న్యాయమా.

ఇద్దరం దోస్తులం అని చెబుతున్నాడు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేసీఆర్ ను వదిలి వెళ్ళిండు.

బిజెపి అభ్యర్థి మాటలను ప్రజలు నమ్మరు.

వెంకట్రామ రెడ్డి మంచి వ్యక్తి.

ఆస్తులు పెంచుకునేందుకు ఆయన రాజకీయాల్లోకి రాలేదు.

కుటుంబ ఆస్తులు పంచుకునేందుకు వచ్చాడు.

వెంకట్రామ రెడ్డి కామెంట్స్……

నేను మీ కలెక్టర్ వెంకట్రామ రెడ్డిని. 11 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీగా, జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా వివిధ హోదాల్లో మీకు సేవ చేసే భాగ్యం కలిగింది.

మీ ఆదరణను, ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను. మీ సేవకుడిగా, మీలో ఒకడిగా ఉండాలని మీ ఆశీర్వాదం కోరుతూ మెదక్ ఎంపీగా మీ ముందుకు వస్తున్నాను.

ఉమ్మడి మెదక్ ప్రజల రుణం తీర్చుకోవాలనే సదుద్దేశ్యంతో, నా తల్లి, అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి రూ. 100 కోట్లతో వెంకటరామ రెడ్డి ట్రస్టు ద్వారా సేవలందిస్తానని హామీ ఇస్తున్నాను.

పేద పిల్లలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత కోసం కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.

10 లక్షల ప్రమాద బీమా అందరికీ చేయిస్తాను.

నిబద్ధత కలిగిన అధికారిగా, పేదలకు సేవ చేసిన వ్యక్తిగా ఉమ్మడి మెదక్ ప్రజలకు నా జీవితం తెరిచిన పుస్తకం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని, మీ ఎంపీగా నన్ను దీవించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!