
leader
ఇద్దరికీ నా జీవితాంతం రుణపడి ఉంటాను..
*ఒకటి మా అధినేత పవన్ కళ్యాణ్, రెండవది మీడియాకి – కిరణ్ రాయల్..
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 06:
నేను ఏ తప్పు చేయలేదు అని కొంతమంది నమ్మారు అది చాలు, ఇది నా పై దాడి కాదు ఒక కులం పై దాడి.. సామాన్యుడు రాజకీయాలు చేస్తే భరించలేరని రాజకీయంగా ధైర్యంగా పోరాటం చేసిందుకు 26 రోజులు మానసిక క్షోభకు గురిచేశారని కిరణ్ రాయల్ గురువారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో తొక్కాలని చూశారని, నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేశారని, నేను జీవితకాలం రుణపడి ఉండేది ఇద్దరికేనని.. మా అధినేత పవన్ కళ్యాణ్, రెండోది మీడియాకు అన్నారు. ఏ తప్పు చేయలేదని పవన్ కళ్యాణ్ కు తెలుసు కాబట్టే విచారణ చేయమన్నారని, తిరుపతిలో కాపులను టార్గెట్ చేశారన్నారు. అందుకే నా గొంతు నొక్కి అణగదొక్కే ప్రయత్నం చేశారని, నేనే తప్పు చేయలేదని కొందరు నమ్మారు అది చాలన్నారు. నేను మొండివాడిని కాబట్టే నిలదొక్కుకుని తప్పు చేయలేదని బయటకు వచ్చానని కిరణ్ స్పష్టం చేశారు. నాపై జరిగిన కుట్రలో ఉన్న వారందరి జాతకాలు వద్ద ఉన్నాయని, సాక్ష్యాలతో అన్నీ మా అధినేత పవన్ కళ్యాణ్ వద్ద ఉంచుతానన్నారు.లక్ష్మిరెడ్డి తో ఉన్నది ఆర్థిక లావాదేవీలు మాత్రమే నని, ఒక మహిళను రాజకీయాల్లోకి లాగి అనేక రకాలుగా హింసకు గురి చేశారని కిరణ్ రాయల్ వాపోయారు..