ఏం తినేటట్లు లేదు ఏముకునేటట్లు లేదు
మందమర్రి నేటి ధాత్రి:
మందమర్రి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల బ్రతుకులు మాటలకే పరిమితమా సింగరేణిలో కాంట్రాక్టు అంటే ఎగిరి గంతేస్తున్న బడా కాంట్రాక్టర్లు ? 8 రాష్ట్రాలలో అమలైనా హై పవర్ కమిటీ వేతనాలు మన తెలంగాణ రాష్ట్రం సింగరేణి బొగ్గు బావిలో ఎందుకు అమలు కాలేదు ఎవరిది వివక్షత సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు జీతాలు పెరిగితే జీర్ణించుకోలేకపోయే అప్పుడున్న పెద్దలు ఎవరు ఐ పవర్ కమిటీ వేతనాలలో సంతకాలు ఎందుకు చేయలేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులు కట్టు బానిసల వల్లే పని చేయాలని అర్థమా
తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మా శ్రమ మా కష్టం కడుపు మార్చుకో నీ పని చేస్తేనే దేశానికి వెలుగులు సింగరేణి పర్మనెంట్ కార్మికులకు తో సమానంగా పనిచేస్తున్న కానీ కాంట్రాక్టు కార్మికులకు సరైన వేతనం లేక హరి గౌస పడుతున్న విషయాన్ని సింగరేణి యాజమాన్యానికి తెలియదా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న సింగరేణి కాంటాక్ట్ కార్మికుల ఓటు బ్యాంక్ తో చెలగాటలాడుతున్నారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు పర్మినెంట్ కార్మిక సంఘాలు స్టేజీల మీద మాటలకే పరిమితం అవుతున్నాయి వేజ్ బోర్డు సమావేశాలలో ఏ ఒక్కరోజు కూడా కాంట్రాక్టు కార్మికుల హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయించలేని దుస్థితిలో ఈరోజు మనము ఉన్నామంటే సిగ్గుచేటు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న కానీ ఈరోజు కూడా మాటలకే పరిమితం అవుతున్న కార్మిక హక్కులను కాలరాస్తున్నారు అని కార్మికులు గుసగుసలాడుతున్నారు సింగరేణి యాజమాన్యం ప్రభుత్వాలు కాంట్రాక్టు వ్యవస్థని కట్టు బానిసలుగా మార్చే దిశగా పయనిస్తున్న ఆశ్చర్యపడేది లేదు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న హై పవర్ కమిటీ వేతనాలు ఈరోజు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం సింగరేణి బొగ్గు బావుల్లో పదకొండు డివిజన్లో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఎదురుచూపు కె పరిమితం తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలు పేరుతో ఉద్యమాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ గారు సకల జనుల సమ్మెలో ప్రతి బొగ్గు బై పైన 11 డివిజన్లలో సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడి సకల జనుల సమ్మెలో 42 రోజుల సమ్మెను కాంట్రాక్టు కార్మికులు జీతం లేకుండా కుటుంబాలను ఆకలితో మార్చి సమ్మెలో విజయవంతం చేసిన ఘనత సింగరేణి కాంటాక్ట్ కార్మిక సోదర సోదరీమణులది కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిపై కూర్చొని సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల లేరు అని నిండు అసెంబ్లీలో చెప్పి అవమానపరిచి కార్మికుల గొంతు కోశారు.నిజం కాదా
టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కొట్టుకపోయి మార్పు జరగాలని ప్రజలు నిర్ణయాన్ని సింగరేణి కాంటాక్ట్ కార్మికులు ఏకతాటిగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నాము సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన ఘనత చరిత్ర సింగరేణి ప్రాంత బిడ్డలది కాదని ఈరోజు అడుగుచున్నాము కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు 11 రివిజన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకసారి ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని మాట్లాడి ఒక తాటిపైన ఉండి సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు 22 జీవో.ఐ పవర్ వేతనాలు ఇప్పించే దిశగా మీరు ముందుండి కార్మికులకు అండగా ఉంటారని గడిచిన సంవత్సరం నెలలో రామగుండం ఎమ్మెల్యే ఒక్కడు రెండుసార్లు మాట్లాడడం జరిగింది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆశతో ఉన్నారు వారికి అతి తక్కువ వేతనాలు ఉన్నాయి వారికి కచ్చితంగా మనము ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని.22వ జీవో అమలు చేయాలని చెప్పడం సంతోషకరమైన విషయం కానీ అదే పది డివిజన్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఆరోజు ప్రస్తావించి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కి తెలియజేసి ఉంటే ఈరోజు కాంట్రాక్టు కార్మికులకు ఇంత అంత మేలు జరిగేది కూల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు ఈరోజు తెలియజేస్తున్నాం కార్మికుల పక్షాన విన్నమిస్తున్నాము అర్ధిస్తున్నాము వేడుకుంటున్నాము సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కాంటాక్ట్ కార్మిక సోదర సోదరీమణులకు జీతాలు పెంచే దిశగా మీరు అడుగులు వేయాలని మీ వెనకాల మేము ఉంటామని కాంగ్రెస్ పెద్దలకు మా తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాము