
భద్రాచలం డివిజన్ నేటి దాత్రి
వెంకటాపురం మండలం లో రెండు రోజుల క్రితం కాంగ్రెస్స్ పార్టీ లో చేరిన సర్పంచ్ లు అందరూ తిరిగి గంప రాంబాబు ,గూడపాటి శ్రీనివాస్ , దామోదర్ నేతృత్వంలో డాక్టర్ తెల్లం వెంకట్రావు మానే రామకృష్ణ సమక్షం లో సొంత గూటికి చేరారు
చేరిన వారిలో బెస్త గూడెం సర్పంచ్ చిదేం లాలిబాబు, మురవాని గూడెం సర్పంచ్ మడకం సారయ్య ,దాచపల్లి సర్పంచ్ సర్లం సమ్మయ్య వారితోపాటు బట్టా ఏడుకొండలు బొల్లి దేవుడు,రామతెంకి జానికిరావు ,బట్టా మోహనరావు మరియు వారి అనుచర వర్గం తిరిగి సొంత గూటికి చేరారు
ఈ సందర్భంగా డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మాట్లాడుతూ పార్టీ మీద నమ్మకం గౌరవం తో తిరిగి సొంత గూటికి చేరిన అందరికీ ధన్యవాదములు తెలపటం జరిగినది పార్టీ హ్యాట్రిక్ అధికారం లో కి వస్తున్న తరుణం లో భద్రాచలం నియోజక వర్గం లో మనం కూడా భాగస్వామ్యులు కావాలి అనే ఉద్దేశం తో కష్టపడి పనిచేసి న చేస్తున్న గంప రాంబాబు, గూడపాటి శ్రీనివాస్, డర్ర దామోదర్, లకు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు
ప్రతి ఒక్క కార్యకర్త కష్ట పడి పనిచేయాలి అని వారి కష్టానికి ఫలితం నేను గెలిచి న తరువాత మీ అందరీ రుణం తీర్చుకునే క్రమంలో అభివృద్ధి చేసుకుందాం గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నేతృత్వంలో భద్రాచలం డివిజన్ ను పూర్తి స్తాయ్ లో అభివృద్ధి చేసుకుందాం అని తెలిపారు
ఈ కార్యక్రమంలో మాజీ నియోజక వర్గ ఇంచార్జీ మానే రామకృష్ణ, జిల్లా నాయకులు గూడపాటి శ్రీనివాస్ , వెంకటాపురం మండలం అధ్యక్షులు గంపా రాంబాబు, బిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి డర్ర దామోదర్, భద్రాచలం మండల అధ్యక్షులు తిరుపతి రావు,రమాకాంత్ , నక్కా ప్రసాద్ , రమేష్ గౌడ్ , బొలిసెట్టి రంగారావు , తాండ్ర నరసింహారావు , రాజీవ్ బండారు సుధాకర్ , దారపునే రాంబాబు , బద్ది ప్రశాంత్ తదితర నాయకులు కార్యకర్త లు పెద్ద ఎత్తున్న హాజరు అయినారు