హైడ్రాపై ప్రజల్లో వస్తున్న చైతన్యంపై నేటిధాత్రి కథనానికి కమీషనర్ ప్రశంస.
ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కథనాలు ఎంతో అవసరం.
హైడ్రా వల్ల జరగనున్న మంచి పరిణామాలపై మరింత లోతైన విశ్లేషణలు అందించాలని కోరిన రంగనాధ్.
రంగనాధ్ ను కలిసిన నేటిధాత్రి డిజిటల్ మీడియా సిఈఓ కట్టా శివ సుబ్రహ్మణ్యం.
శివ సుబ్రహ్మణ్యంతో అనేక విషయాలు చర్చించిన రంగనాధ్.
హైడ్రాపై మీడియా పరంగా నేటిధాత్రి ఇచ్చిన సపోర్ట్‌కు అభినందనలు చెప్పిన రంగనాధ్.
హైడ్రాపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించే విధంగా నేటిధాత్రి దిన పత్రిక, నేటిధాత్రి డిజిటల్ మీడియాలో వచ్చిన కథనం చాలా బాగుందని కమీషనర్ రంగనాధ్ ప్రశంసించారు. హైడ్రా కమీషనర్ రంగనాధ్‌తో నేటిధాత్రి డిజిటల్ మీడియా సిఈఓ కట్టా శివ సుబ్రహ్మణ్యం శని వారం బుద్ద భవన్‌లో వున్న కార్యాలయంలో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివ సుబ్రహ్మణ్యంతో కమీషనర్ మాట్లాడుతూ ప్రజలను సామాజికంగా చైతన్యం చేయడంలో నేటిధాత్రి విశేషంగా కృషి చేస్తోందని అభినందించారు. తాను నిత్యం నేటిధాత్రి దిన పత్రికను తప్పకుండా చూస్తుంటానని చెప్పారు. హైడ్రా పని తీరు, ప్రజల నుంచి ఇటీవల వస్తున్న స్పందనలను ఎంతో విశ్లేషణాత్మకంగా చెప్పడం జరిగిందన్నారు. అంతే కాకుండా హైడ్రా వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ ఎలా వుండబోతోంది, పర్యావరణ పరిరక్షణలో హైడ్రా ఎలాంటి పాత్ర పోషించబోతోందనే విషయాలు ఎంతో స్పష్టత చెప్పారని రంగనాధ్ తెలిపారు. హైడ్రా లాంటి గొప్ప కార్యక్రమం విజయవంతం కావాలంటే నేటిధాత్రి లాంటి మీడియా సపోర్ట్ ఎంతో అవసరమని గుర్తు చేశారు. హైడ్రాపై ఇంకా చైతన్యం తీసుకొచ్చే బాధ్యతను మీడియా పరంగా నేటిధాత్రి తీసుకోవాలని రంగనాధ్ కోరారు. హైడ్రా విషయంలో ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా వుంటామన్నారు. హైడ్రా కార్యాలయం ప్రారంభమైన రోజు నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తమ, తమ కాలనీలలో దశాబ్దాల తరబడి అనుభవిస్తున్న సమస్యలను వివరిస్తూ విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నారని రంగనాధ్ తెలియజేశారు. హైడ్రాతో తాము కొన్ని దశాబ్దాలగా అనుభవిస్తున్న సమస్యలు తీరుతుండడంతో ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని రంగనాధ్ గుర్తు చేశారు. అలాంటి అంశాలతో కూడిన నేటిధాత్రి కథనం కూడా అద్భుతంగా వుందని కమీషనర్ చెప్పారు.