Demand to Make Hyderabad Second Capital of India
దేశ రెండవ రాజధానిగా హైదరాబాదును ఏర్పాటు చేయాలి
ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్
మంచిర్యాల,నేటి ధాత్రి:
దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ ను ఏర్పాటు చేయాలని ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్సీ సంక్షేమ సంఘం మంచిర్యాల కార్పొరేషన్ ముఖ్య నాయకుల సమావేశం శ్రీరాంపూర్ లోని ఆర్కే సిక్స్ ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించారు.ఈ సమావేశానికి మంచిర్యాల నియోజకవర్గం అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి నర్సింగ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నర్సింగ్ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని కోరారు.మహానీయుల సిద్ధాంతాలను పోరాటపటివను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని,భూ భౌగోళికంగా అన్ని సౌకర్యాలు కలిగిన హైదరాబాద్ ను రెండవ రాజధానిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.త్యాగానికి నిలువెత్తు నిదర్శనం భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను పార్టీ పుస్తకాలలో చేర్చి ఎస్సీ సంక్షేమం కోసం ప్రత్యేక ఎస్సీ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.నిరుద్యోగులైన యువతి,యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడం కొరకు శిక్షణ ఇచ్చి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు లోన్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీల సంక్షేమ కోసం సంక్షేమ భవనం కొరకు స్థలం ఏర్పాటు చేయాలన్నారు.ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్తూ సమస్యలు పరిష్కారం అయ్యేలా నియోజవర్గంలోని గ్రామ కమిటీలు,మండల కమిటీలు త్వరగా పూర్తిచేసి జిల్లా కమిటీని పటిష్టం చేస్తామని తెలిపారు.
సంఘం యొక్క తీర్మానాలు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రభుత్వ హాస్టల్ పాఠశాల విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పాటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తదితర అంశాల పైన తీర్మానం చేశారు. సంఘం యొక్క తీర్మానాలను సభ్యులందరి ఆమోదంతో జిల్లా యూత్ అధ్యక్షులు బింగి సదానందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.అలాగే మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షులుగా శ్రీరాంపూర్ హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన జక్కే మొగిలి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపాలిటీ ఏరియా అధ్యక్షులు పార్లపెల్లి సారయ్య,శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు పుట్ట రవి, మద్దెల స్వామి దొంత మురళి, వార్డ్ ఇన్చార్జి కౌటం కృష్ణ, నూకల రాజయ్య, అరుణక్కనగర్ ఏరియా ప్రధాన కార్యదర్శి భోగ శంకర్, నాయకులు బవండ్లపల్లి నరసయ్య,సొల్లు కొమరయ్య, జక్కే మొగిలి,చేవుల వాసు, బేతే రాజశేఖర్,కనుమల్ల అనిల్ కుమార్,వేముల మల్లమ్మ,కావటం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
