పుస్తకాలు కొనండి….
జహీరాబాద్ నేటిధాత్రి:
ప్రతి సంవత్సరం 11 రోజులపాటు హైదరాబాద్ కేంద్రంగా ఎన్టీఆర్ స్టేడియం లో హైదరాబాద్ బుక్ ఫేయిర్ పేరుతో నిర్వాహకులు పుస్తకాల పండుగను నిర్వహిస్తున్నారు.పుస్తక ప్రియులకు దేశ ,ప్రపంచ గొప్ప గొప్ప రచయితల రచనలకు పరిచయం చేసి పుస్తక పఠనానికి దోహదం చేస్తున్నారు. దాదాపు 368 పైగా పుస్తకాల స్టాల్ లను ఏర్పాటు చేసి వివిధ రకాల పుస్తకాలను విభిన్న భాషల పుస్తకాలు పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు.పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఈ లాంటి బుక్ ఫేయిర్ లను ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం అని జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత డా.పెద్దగొల్ల నారాయణ అన్నారు. పుస్తకాలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని, ఉన్నత,ఉత్తమ విలువలకు దోహదం చేస్తాయి కనుక ప్రతి ఇంటిలో తప్పకుండా కనీసం లో కనిసంగా 100 పుస్తకాలతో మినీ గ్రంథాలయం ఉండాలని సూచించారు. ఈనాటి యువ ప్రపంచానికి పుస్తకాల ప్రాముఖ్యతను తెలియపరుచడం చాలా ముఖ్య విషయం అన్నారు. ఈ సందర్భంగా తాను రాసిన పుస్తక విలాపం రచనను గుర్తు చేసుకున్నారు. అందులోని ఒక వాఖ్యాన్ని గుర్తు చేశారు. ఈ నెట్ వచ్చాక యువత నన్ను(పుస్తకం) నెట్టి వేస్తున్నారు అని పుస్తకం విలాపం చెందిన తీరును తెలియజేసారు.ఏ కార్యక్రమంలో తనకు మాట్లాడడానికి అవకాశం వచ్చినా విద్యా, పుస్తకాల గొప్ప తనం గురించి, ఎక్కడైనా యువకులు కనిపించిన పుస్తక గురించి ప్రస్తావించారు.హైదరాబాద్ బుక్ ఫేయిర్ అంటే తనకు కూడా చాలా ఇష్టం అన్నారు.ప్రతి సంవత్సరం ఆ పుస్తకాల పండుగలో పాల్గొని చాలా పుస్తకాలను కొనుగోలు చేస్తాను అన్నారు.వివిధ రచనలు చెయ్యడం తో పాటు, వివిధ రకాల పుస్తకాలను సేకరించి చదవడం అదృష్టం గా భావిస్తాను అని గుర్తు చేశారు..
జహీరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులతో కలిసి బుక్ ఫేయిర్ ను సందర్శించి పలు పుస్తకాలను కొనుగోలు చేశారు..
