కూకట్పల్లి, ఫిబ్రవరి 29 నేటి ధాత్రి ఇన్చార్జి
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డులో గల జిల్లా పరిష త్ హాయ్ స్కూల్ లో అల్లూరి సీతా రామరాజు జ్ఞాపకార్థం క్షత్రియ యూ త్ ఫెడరేషన్ వారి ఆధ్వ ర్యంలో పదవ తరగతి చదువుతు న్నటు వంటి విద్యార్థిని,విద్యార్థులకు 92 మందికి ఎగ్జామ్ ప్యాడ్,జామెంట్రీ బాక్స్, పెన్నులను పాఠశాల ప్రధానో పాధ్యాయులు సాయి కుమార్తో కలి సి అందజేసిన హైదర్ నగర్ డివి
జన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల జీవితా నికి మూలస్తంభం లాంటిదని పట్టు దల క్రమశిక్షణ అలవర్చుకొని శ్రద్ధగా చదువుకొని పదవ తరగతిలోమంచి ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించి తమ తల్లిదండ్రులకు పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసు కురావాలని కోరారు. ప్రభుత్వ పాఠ శాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మస్తైర్యంతో ఒత్తిడి లేకుండా పరీ క్షలు రాయాలని,మంచి మార్కుల తో విజయాలను అందు కోవాలన్నా రు.విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమ వుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన క్షత్రియ యూత్ ఫెడరేషన్ వారిని ప్రత్యేకంగా అభి నందించడం జరిగింది.