Hussainpalli Development a Priority: Sarpanch Edla Swaroop
హుస్సేన్ పల్లి గ్రామాభి వృద్ధికి నిరంతరం పని చేస్తా
జీఎస్సార్ కలిసిన గ్రామ సర్పంచ్ ఎడ్ల స్వరూప – సుధాకర్ రావు
శాయంపేట నేటిధాత్రి:
హుస్సేన్ పల్లి గ్రామాభివృద్ధికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహ కారంతో నిరంతరం పని చేస్తా నని హుస్సేన్ పల్లి గ్రామ సర్పంచ్ ఎడ్ల స్వరూప – సుధా కర్ రావు అన్నారు. ఎమ్మెల్యే ను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కు ఎమ్మెల్యే శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా మమ్ములను గెలిపించినం దుకు ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు. గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మా ణానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్ర మంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బు చ్చిరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
