మంచిర్యాల నేటిదాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ ను గత 15 నెలల క్రితం మూసివేయడం జరిగింది. అప్పటినుండి కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించమని కార్మికులు మొరపెట్టుకున్న కూడా యాజమాని మల్కా కొమురయ్య గారు చెల్లించకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేటితో 36వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు, ఇప్పటికైనా యజమాన్యం స్పందించి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలి, లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం…