గుండాల మండలం లో ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ వార్షికోత్సవాలు
ప్రజా ఉద్యమాలే సీపీఐ ఆయుధం
త్యాగాలలో పునీతమైన చరిత్ర సిపిఐది
సిపిఐ గుండాల మండల కార్యదర్శి వాగబోయిన రమేష్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ప్రజా ఉద్యమాలే సీపీఐకి ఆయుధమని మనిషిని మనిషి దోపిడి చేయని సమ సమాజ నిర్మాణంకోసం ఆవిర్భవించిన సిపిఐ నాటి నుంచి నేటివరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుదూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని, సిపిఐ 100 వ ఆవిర్భావ వార్నికోత్సవాలను గుండాల,సాయనపల్లి,మాజీ సర్పంచ్,కీర్తిశేషులు బచ్చల లక్ష్మినర్సు స్థూపం వద్ద వివిధ ప్రాంతాలలో ఘనంగా అరుణ పతాకాల ఆవిష్కరణలు చేశారు, ఈ సందర్భంగా రమేష్ మాట్లడుతూ కార్మిక, కర్షక, ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసే సత్తా కమ్యూనిస్టలకే ఉంది అన్నారు.
దేశ స్వాతంత్ర్య కోసం, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమాలతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన పార్టీ సిపిఐ ఎన్నో త్యాగాలు చేస్తూ బ్రిటీష్ కాలం నుండి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు ఏర్పడిందని స్పష్టం చేశారు. అప్పటి రజాకార్ల, భూస్వాముల పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దొరలను, దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టి లక్షలాది ఎకరాల భూమిని పంచి బాంచన్ దొర నీకాల్మోకుత అని బతికే బడుగు బలహీన జీవులు బందూకులు పట్టించి గెరిల్లా రైతాంగ పోరాటం నడిపించిన చరిత్ర సీపీఐదన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా హక్కుల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమిస్తున్న పార్టీ సిపిఐ అన్నారు. 100 ఏండ్ల సుధిర్ణ ప్రస్తానంలో సిపిఐ నిర్వహించిన పోరాటాలు, ఉద్యమాలతో ప్రజలకు, కార్మికవర్ష్గానికి అనేక హక్కులు, సౌకర్యాలు సాధించి పెట్టిట్టామని, ఎందరో అమరవీరులు నేలకొరిగారని, మరెందరో ప్రజలకోసం తమ జీవితాలను త్యాగం చేశారని వారి ఆశయాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు అనునిత్యం శ్రమించాలని కోరారు. ఉద్యమాలు నిర్వహించి నిర్మాణపరంగా గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే విషయంలో ప్రతి కార్యకర్త కృషిమరువలేనిదన్నారు.
ఈ కార్యక్రమంలో
బికేఏంయు మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే షాహిద్, బచ్చల లక్ష్మయ్య, గంగాధరి రాజయ్య,దాశరథి,ముత్తయ్య, రమ్మల్లెష్,అంజి, హరీష్,విజయ్, రాజేష్,మహేష్,శివ వంశి తదితరులు పాల్గొన్నారు.