
FIDE Women's World Cup.
తొలి గేమ్‌లో హంపి గెలుపు
తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు అర పాయింట్ దూరంలో నిలిచింది. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి యుక్సిన్ సాంగ్‌పై హంపి…
మహిళల చెస్ వరల్డ్‌కప్ క్వార్టర్స్
బటూమి జార్జియా): తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు అర పాయింట్ దూరంలో నిలిచింది. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి యుక్సిన్ సాంగ్‌పై హంపి విజయం సాధించింది. తెల్లపావులతో ఆడిన హంపి 53 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట కట్టించింది. ఆదివారం జరిగే రెండో గేమ్‌ను డ్రా చేసుకొన్నా చాలు.. హంపికి సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. కాగా, భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్ మధ్య క్వార్టర్స్ మొదటి గేమ్ డ్రాగా ముగిసింది. ఇక, మరో క్వార్టర్స్ తొలి గేమ్‌లో మాజీ వరల్డ్ చాంపియన్ జోంగి టాన్ (చైనా)తో వైశాలి పాయింట్ పంచుకొంది. ఇక, క్వార్టర్స్‌లో హారిక, దివ్య తలపడుతుండడంతో భారత్ తరఫున ఒకరు సెమీస్ చేరడం ఖాయమైంది.