
TBSS President Advocate Rajalingu Mothe
మానవ అక్రమ రవాణా మానవత్వం పై జరిగే క్రూరమైన దాడి
టీబిఎస్ఎస్ అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతె
మంచిర్యాల జులై 30, నేటి దాత్రి
మానవ అక్రమ రవాణా మానవత్వం పై జరిగే క్రూరమైన దాడి అని టిబిఎస్ఎస్ అధ్యక్షులు అడ్వకేట్ రాజలింగు మోతె అన్నారు. బుధవారం ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక ప్రయోజనాల కోసం మనుషులను అంగడి సరుకుగా మార్చి క్రయ విక్రయాలు జరపడం అత్యంత దుర్మార్గం అన్నారు. ఇది వెట్టి చాకిరి, లైంగిక దోపిడి, బానిసత్వం రూపాల్లో ఉంటుందన్నారు. ఇది మానవత్వం పై జరిగే క్రూరమైన దాడి అని అన్నారు. ఉపాధి అవకాశాలు లేకపోవడం, పేదరికం, అవినీతి, ప్రాంతాల మధ్య ఆర్థిక అసమతౌల్యాలు లాంటివి అక్రమ రవాణాకు ప్రధాన కారణాలుగా ఉంటాయన్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు దీని బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ మానవ అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించడంతోపాటు,నివారించడానికి వ్యక్తులు,ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నిరంతరం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కాంపల్లి హరిచరణ్, రాష్ట్ర నాయకుడు అంబాల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.