పర్యావరణ పరిరక్షణతోనే మానవమనుగడ సాధ్యం

environmenta environmenta

పర్యావరణ పరిరక్షణతోనే మానవమనుగడ సాధ్యం –

ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు..

*ప్లాస్టిక్ భూతం నుండి పంచ భూతాలను కాపాడుకుందాం..

*చైర్మన్ సుగుణమ్మ..

*మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం –

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూన్ 05: 

 

పర్యావరణ పరిరక్షణ తోనే భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమవుతుందని, ఇందుకోసం మొక్కలు పెంచాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సీతమ్మ రోడ్డు నందు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, కమిషనర్ ఎన్.మౌర్య, అర్బన్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ విజయకుమార్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదా శివం, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్ దూదికుమారిలు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన తిరుపతిలో పర్యావరణ పరిరక్షణ కొరకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. 5090 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. నాటిన మొక్కలను యువకులు, మహిళలు దగ్గరుండి కాపాడుకోవాలనీ అన్నారు. బీట్ ప్లాస్టిక్ పొల్యూష‌న్ థీమ్ తో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవాణ్ని నిర్వ‌హించుకుంటున్నామ‌ని, ఒక‌సారి వాడి ప‌డేసే ఫ్లాస్టిక్ కు ప్ర‌జ‌లు దూరంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ప్లాస్టిక్ పొల్యూష‌న్ త‌గ్గింపులో భాగంగా ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఒక‌సారి వాడి ప‌డేసే ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించార‌ని ఆయ‌న తెలిపారు. ప్లాస్టిక్ విన‌యోగంతో ప్ర‌జ‌ల ఆరోగ్యంతో పాటు జంతువుల ఆరోగ్యం దెబ్బ‌తింటోంద‌ని ఆయ‌న చెప్పారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు హరితాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నారని మనందరం వారికి సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.ఈ సంవత్సరం థీమ్ ను అందరూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అన్నారు. పంచ భూతాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ నివారణకు అందరూ కంకనబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
నగరపాలక సంస్థ కమిషనర్, తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకై నగరపాలక సంస్థ పరిధిలో 5090 మొక్కలు, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో 15 వేలు మొక్కలు నాటుతున్నామని అన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని ప్లాస్టిక్ ఫ్రీ సిటీ గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మొక్కలు నాటిన తరువాత వాటిని సంరక్షించాలని అన్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వినియోగించే వాటి పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేదించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు, ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి,డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఏసిపి బాలాజి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!