మానవ హక్కులు పాలకుల బిక్ష కాదు

: విఏసిసి చైర్మన్ మోతె రాజలింగు

రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 19, నేటిధాత్రి:

మానవ హక్కులు పాలకుల బిక్ష కాదని విజిలెన్స్ ,యాంటీ కరప్షన్ కౌన్సిల్ – వి ఏ సి సి చైర్మన్ మోతె రాజలింగు అన్నారు. సోమవారం పట్టణంలోని వి ఏ సి సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన వేల్పుల వెంకటస్వామిని ఎన్నుకున్నారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను చైర్మన్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మానవ హక్కులు ప్రతి వ్యక్తికి పుట్టుకతో వచ్చే హక్కులనీ,ప్రతి సామాన్యుడికి ఈ హక్కులు అత్యవసరమైనవి అని అన్నారు. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వసాధారణ మయ్యాయని ఆయన అన్నారు.ప్రజా ప్రతినిధులు తమ ఊకదంపుడు ఉపన్యాసాలలో చెబుతున్నట్టుగా చట్టం ముందు అందరూ సమానులే అంటున్నట్లు,వారి పాలనలో మాత్రం ఆచరణలో కనిపించడం లేదన్నారు.ప్రభుత్వాలు చెబుతున్నది ఒకటే ఆచరిస్తున్నది ఇంకొకటిగా.. దేశంలో మహిళలు, బాలికల పట్ల హత్యలు, జాతి వివక్ష దాడులు నేటికి సమాజంలో కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వాలు మాత్రం మానవ హక్కుల ఉల్లంఘన పట్ల చిత్త శుద్ధితో ముందడుగు వేసినట్లు కనిపించడం లేదన్నారు. కార్యక్రమంలో సభ్యులుకలవల సతీష్ కుమార్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!