
క్రైస్తవుల మీద దాడిని ఖండిస్తున్నాం-ఎల్తూరి శ్రీనివాస్ బిఎస్పీ జిల్లా అధ్యక్షులు
పరకాల నేటిధాత్రి
మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో క్రిస్టియన్ సోదరులు సోదరీమణులు ప్రార్థన చేసుకుంటుండగా మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచగా విషయం తెలుసుకున్న రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు క్షతగాత్రులను బిఎస్పీ నాయకులు కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు.భాదితులను పరామర్శించేదుకు వెళ్తున్న బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ ని తెలంగాణ రాష్ట్ర పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి వైఖరి ఖండిస్తూ నేడు పరకాలలో పరకాల నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్స్ బీఎస్పీ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాస్టర్స్ బీఎస్పీ కార్యకర్తలు నోటికి నల్లగుడ్డ కట్టుకొని మౌన ప్రదర్శన చేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం వరకు నిరసన తెలుపుతూ మౌన ప్రదర్శన చేసుకుంటూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేసి రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ కి బాధితులకు రక్షణ కల్పించాలని ప్రార్థన మందిరాలకు రక్షణ కల్పించాలని ప్రార్థన మందిరాలలో బోధించబడుతున్న పాస్టర్స్ కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత విద్య వైద్యం ఆరోగ్యం హెల్త్ కార్డులు మంజూరు చేయాలని భారత రాజ్యాంగ హక్కుల ప్రకారం మందిరాలకు పోలీసు భద్రత ప్రభుత్వం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.నాలుగు ఐదు డిమాండ్లతో మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు అమ్మఒడి శ్రీనివాస్ ఎల్తూరి, బీఎస్పీ పరకాల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిలు అమ్మ సాంబయ్య కురుమ, ఆముదాల పెళ్లి మల్లేశం గౌడ్, పెండేల మహేందర్,జిల్లా ఈసీ మెంబర్ ఎండి అంజాద్ పాషా, పాస్టర్స్ ఫెలోషిప్ పరకాల నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ పరకాల మండల అధ్యక్షులు మోజెస్,ఆత్మకూరు మండల అధ్యక్షులు మొగిలి మోజేష్,దామర మండల అధ్యక్షులు రమేష్ పాల్,నడి కూడా మండల అధ్యక్షులు మడికొండ జమాత్,జనరల్ సెక్రెటరీ జాన్ స్మిత్,గీసుకొండ మండల అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్,సంగెం మండల అధ్యక్షులు సామెల్,పరకాల మండల జనరల్ సెక్రెటరీ సాల్మన్,కోశాధికారి కోటేశ్వర్వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ ఎలీషా, సలహాదారులు ఎస్ రాజవీర్, దేవదాస్,ఆత్మకూరు జనరల్ సెక్రెటరీ సాల్మన్గీసుకొండ మండల ప్రెసిడెంట్,సెక్రటరీ జోసెఫ్,సంగెం మండల సెక్రెటరీ,మహిళా పాస్టర్స్ మరియమ్మ,జోసమ్మ, జమునమ్మ,సోనియా,బిఎస్పీ నడికూడ మండల అధ్యక్షులు శనిగరపు వెంకటేష్,మేకల విష్ణు,రవీందర్,సంజయ్, ఉపేందర్,మండల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.