బెల్లంపల్లి నేటిదాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గం
వేమనపల్లి మండలానికి చెందిన బిఆర్ఎస్ ప్రధాన నాయకులు నేడు వేమనపల్లి మాజీ జడ్పీటీసీ ఆర్ సంతోష్ కుమార్, వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ ఆధ్వర్యంలో
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరారు.ఎంపీపీ ఆకుల లింగా గౌడ్ అంబాల శ్రీనివాస్ స్కూల్ కమిటీ చైర్మన్ ములకలపెట్ సంతోష్ చిరంజీవి, జుమ్మిడా శంకర్ దున్న పవన్, ఎడ్ల రూదేష్, కోండ్ర సత్యం, అల్లూరి బక్కయ్య, దసనాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కైరి రాజేష్ గౌడ్,తాల్ల తిరుమలేష్ గౌడ్ సంతోష్ గౌడ్, తాల్ల రామగౌడ్ రాజగౌడ్,మహేష్ గౌడ్సం.తోష్ గౌడ్ రాకేశ్ గౌడ్. రాకేశ్ గౌడ్. సాయి గౌడ్ కిస్టయ.ఆంజన్న.శ్రీను వెంకటేశ్ మహేశ్వర గౌడ్ లతో పాటు రెండు గ్రామాలకు చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.మాజీ ఎంపీపీ ఆకుల లింగాగౌడ్ మాట్లాడుతు నా రాజకీయ ఎదుగుదలకు తోడ్పడింది మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ కి రావడం సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది, నాడైనా నేడైనా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాద్యం అని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలుచేస్తున్న పథకాలు ఎంతో గొప్పవని, వేమనపల్లి మండలంలో రుద్రభట్ల సంతోష్ కుమార్ నాయకత్వంలో పని చేయడానికి సంతోషిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నీల్వాయి తాజా మాజీ సర్పంచ్ గాలి మధు, మాజీ సర్పంచ్ వి. తిరుపతి రెడ్డి, దస్నాపూర్ మాజీ సర్పంచ్ కొమురం రమేష్, చెన్నూరి పురుషోత్తం, నెండుగురి మధుసూదన్, తాళ్ల వెంకటేష్ గౌడ్ వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.