నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి
ఈసీఐఎల్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం
ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 24
ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ మందుల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
నియోజకవర్గం అభివృద్ధినే లక్ష్యంగా నిధులు కేటాయింపుతో పాటు పనులను చేపడుతున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని జంక్షన్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఈసీఎల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ప్రభుత్వం వచ్చి రెండు నెలలు నిండక ముందే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు దశల వారీగా వస్తున్నాయని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవలనే రూ. 10 కోట్ల నిధులను అభివృద్ధి పనుల కోసం కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న అన్ని జంక్షన్ల అభివృద్ధి కోసం కూడా నిధులను మంజూరు చేసినట్లుగా చెప్పారు.
జంక్షన్ల అభివృద్ది కోసం మళ్లీ నిధులు
ఈసీఐఎల్ జంక్షన్ కు రూ.1.05కోట్లు, రాధిక జంక్షన్ కు రూ.90లక్షలు, ఎన్. ఎఫ్. సి చౌరస్తాకు రూ.66లక్షలు, మల్లాపూర్ చౌరస్తాకు రూ.1.13కోట్లు, నాచారం జంక్షన్ రూ.55 లక్షలు చొప్పున నిధులు మంజూరు అయినట్టుగా చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మొదలైందన్నారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో కాప్రా ,చెర్లపల్లి కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి ,స్వర్ణరాజ్ శివమణి
,మాజీ కార్పొరేటర్ ధన్పల్ రెడ్డి ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాఘవ రెడ్డి ,అంజి రెడ్డి ,సింగి రెడ్డి వెంకట్ రెడ్డి ,పెద్ది సీను ,కృష్ణ రెడ్డి ,పెద్ది నాగరాజ్ ,ప్రసాద్ ,అజిజ్ ,విట్టల్ ,శివ ,పూర్ణ ,రాకేష్ ,రమాకాంత్ ,శ్రీకాంత్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.