ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట మార్చ్ 24(నేటిదాత్రి).
గుడి కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు అని మాట్లాడి హిందూ మతాన్ని అగౌరవ పరిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈరోజు ఒక మతాన్ని గౌరవిస్తూ మరో మతాన్ని వ్యతిరేకించడం చాలా విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని విమర్శించారు.
ఒక మతం కి చెందిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని వాళ్లని మాత్రమే ఓటర్లుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ మిగతా మతాలను కులాలను పట్టించుకోకుండా వారికోసం విందులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని వాడుకొని విందులు ఇవ్వడం వల్ల వారి స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు తప్ప మిగతా మతాల వారిని మిగతా కులాల వారిని నియోజకవర్గ ప్రజలుగా వారి ఓటర్లుగా భావించడం లేదని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారిని విమర్శించారు.
నియోజకవర్గంలో ఎన్నో కులాలు మతాలు ఉన్న వారందరినీ కలుపుకొని పోకుండా కేవలం ఒక వర్గాన్ని వారి ఓటర్లుగా సృష్టించుకోవడం విడ్డూరంగా ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.
గ్రామాల్లో కులాల వారిగా వారి వారి కులదేవతలను మొక్కుకుంటూ ఎన్నో పండుగలు జరుపుకుంటున్న వారి కోసం విందులు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు కానీ ఒక వర్గం కోసం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు విందులు ఏర్పాటు విందులు ఇవ్వడం వారి ఓటు బ్యాంకు రాజకీయానికి నిదర్శనం అని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
ఇప్పటికైనా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను గమనించి వారికి చేస్తున్న అన్యాయాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని వారికి విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలోని హిందూ బంధువులంతా ఒకటై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ధ్యేయంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.