నిత్యం వాహనదారుల ఇబ్బందులు
పేరుకే ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం
ఎంపీలు వచ్చినప్పుడు గుర్తుకు వచ్చి రోడ్ల తాత్కాలిక మరమ్మతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి:
కొత్తగూడెం మున్సిపాలిటీ.విజయవాడ నుండి జగదల్పూర్ నేషనల్ హైవే రోడ్డు గుంతలు మయంగా మారింది రామవరం సుభాష్ చంద్రబోస్ నగర్ బేతనియ చర్చి దగ్గర మరియు రామవరం గోదామ వాగు.మరియు సూపర్ బజార్ రైల్వే అండర్ బ్రిడ్జి. నందు. ముర్రేడు వాగు బ్రిడ్జి గోతులమయంగా మారింది నిత్యం. కలెక్టర్.ఎమ్మెల్యే.ప్రభుత్వ అధికారులు ఈ రహదారుల మీదుగా వెళ్తూ ఉంటారు కానీ ఏ అధికారి కూడా పట్టించుకోవటం లేదు కనీసం మున్సిపల్ పాలకవర్గం. ఆర్ అండ్ బి అధికారులు కూడా పట్టించుకోవడం లేదు గత రెండు వారాల క్రితం సూపర్ బజార్ రైల్వే అండర్ బ్రిడ్జి నందు యాష్ ట్యాంకర్ ఇద్దరి మీద పడి చనిపోయారు అయినా కూడా ఈ గుంటల మరమ్మత్తులు చేయించకుండా బార్కెట్లు గుంతలకు అడ్డుగా పెట్టి ఉంచడం వల్ల వాహన దారులు ఆ గుంటలు తప్పించుకుని వెళ్లే ప్రత్యానంలో వాహనాలు ఢీకొనడం జరుగుతుంది కొంచెం వర్షం పడిన గుంటలు కనిపించడం లేదు నీరు నిండి ద్విచక్ర వాహనదారులు పడిపోవడం జరుగుచున్నది ఈ గుంటలన్నింటినీ కూడా మున్సిపాలిటీ వారు గానీ. ఆర్ అండ్ బి వారు కానీ పూడిపించగలరని వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు