లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి
ఎంపీడీవో కల్పనకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు
పరకాల,దామెర నేటిధాత్రి
పరకాల నియోజకవర్గంలోని దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కల్పన కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల అర్హులైన లబ్ధిదారులందరికీ పక్క ఇండ్లు పంపిణీ చేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని భారతీయ జనతా పార్టీ దామెర మండల శాఖ తరపున వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మరియు దామెర మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి,నియోజకవర్గ కో కన్వీనర్ పిఎసిఎస్ డైరెక్టర్ మాదారపు రతన్ కుమార్,ఓబీసీ మోర్చా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేవైఎం జిల్లా కోశాధికారి సూర చంద్రర్,వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ కొట్టే రమేష్, కో కన్వీనర్ గండు ముఖేష్, సీనియర్ నాయకులు గువ్వ సాంబయ్య,ఆలేటి పోషాలు, దామెర పృథ్వీరాజ్,శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు ఎక్కలదేవి రమేష్, గోగుల సమ్మిరెడ్డి,గండు పరుశురాం,బూత్ అధ్యక్షులు బి.రమేష్,చెల్పూరి రాజు, గూడూరు శ్రీనివాస్,మనోజ్, తదితరులు పాల్గొన్నారు.