తహసిల్దార్ కల్వల సత్య నారాయణ
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లాశాయంపేట మండలం తహసిల్దార్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన బిఎల్ఓల సమావేశంలో తహసిల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ బిఎల్ఓ లు ఇంటింటి సర్వే రెండు మూడు రోజులలో పూర్తి చేయాలని తహసిల్దార్ ఆదేశించారు. సూపర్వైజర్లు ప్రతిరోజు పర్యవేక్షించి బిఎల్ఓ లు త్వరలో పూర్తిచేసేలా చూడాలని తహసిల్దార్ అన్నారు. ఇంటింటి సర్వేలో మరణించిన డబుల్ ఓటర్లను గుర్తించి ఫారం -7 ద్వారా తొలగించాలని తహసిల్దార్ సూచించారు. బిఎల్వోలు ఇంటింటి సర్వేలో నిర్లక్ష్యం చేస్తే తగు చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ఎం.ఆర్.ఐ శరత్ కుమార్ ఏ.ఆర్.ఐ రమేష్, సీనియర్ సహాయకులు అచ్చారావు, జూనియర్ సహాయకులు శైలజ, రాజు, రికార్డ్ అసిస్టెంట్ సత్యం, తులసి మోహన్, తదితర బిఎల్ఓ లు పాల్గొన్నారు.