కమర్షియల్ గ్యాస్ కోసం హోటల్ యజమాన్యం ఇబ్బంది
వంట గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు
సిపిఐ ఎంఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
బుక్ చేసుకునే విధానం రద్దుచేసి పాత పద్ధతిలోనే గ్యాస్ డెలివరీ చేయాలని సామాన్య ప్రజలు గ్యాస్ బుక్ చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో డెలివరీ కావడానికి 20 రోజులు పడుతుంది సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు బుక్ చేసుకునే విధానం తెలవక కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు పాత పద్ధతిలోనే గ్రామాలలో గ్యాస్ ఇంటింటికి డెలివరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇండియన్ గ్యాస్ హెచ్ పి భారత్ గ్యాస్ యజమాన్యం ఈ ముగ్గురు యజమాని ఇస్తానుసారంగా గ్యాస్ గోదాముల దగ్గర బ్లాకులో జోరుగా అమ్మకాలు జరుగుతున్నాయి కమర్షియల్ గ్యాస్ 1850 ఉంటే ₹3000 రూపాయలకు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు వంటగ్యాస్ 1000 రూపాయలు ఉంటే 2000 రూపాయలకు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు జిల్లా ఉన్నతాధికారులు గ్యాస్ గోదాములను తనిఖీ చేసిన దాఖలు కానరావడం లేదు వాళ్ళ ఇష్టానుసారంగా దందా నడుస్తున్న పట్టించుకునే నాధుడు లేడు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సరిపడ గ్యాస్ నిలువలు ఉన్నాయని చెప్తా ఉంది ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు వెనకటి కాలం మళ్ళీ వస్తుంది కట్టెల పొయ్యి కొనాలన్న 20 వేల రూపాయలకు పైనే అవుతా ఉన్నాయి హోటల్ యజమాన్యం బజ్జీల బండి వాళ్లు చాయ్ హోటల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కమర్షియల్ గ్యాస్ ను బ్లాక్ లో 3000 పెట్టి కొనుగోలు చేస్తా ఉన్నారు ఒకపక్క వ్యాపారం జరగక చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతూ గ్యాస్ ఎప్పటిలాగానే సరఫరా చేయాలని కొంతమంది గ్యాస్ బుక్ చేసుకుంటే యజమాన్యం డెలివరీ కాకముందు ఓటీపీ తీసుకుంటున్నారు వేరే వాళ్లకు బ్లాకులో అమ్ముకొని వారిని ఇబ్బందుల గురిచేస్తున్నారు తక్షణమే హెచ్ పి గ్యాస్ భూపాలపల్లి చిట్యాల. పరకాల ఇండియన్ మొగుళ్లపల్లి భారత్ గ్యాస్ యజమాన్యపై చర్యలు తీసుకొని గోదాములను తనిఖీ చేసి ప్రజలకు వ్యాపారులకు పాత పద్ధతిలోనే గ్యాస్ డెలివరీ చేయాలని జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని వారు అన్నారు చేశారు ఈ కార్యక్రమంలో ఏఐసీసీ టు యు జిల్లా కార్యదర్శి కన్నూర్ డానియల్ ఎన్ హెచ్ ఆర్ సి నాయకులు కొలుగూరి సదానందం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు
