SBI AGM Praises Hope Foundation’s Services
హోప్ ఫౌండేషన్ సేవలు భేష్….ఎస్ బి ఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విజయ లక్ష్మి.
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ సేవలు భేష్ అని, సమాజాన్ని తనవంతుగా కొంత సేవ చేయాలనే మానవత దృక్పధంతో అన్న దానంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారికి ఈ సందర్బంగా అభినందనలు తెలుపుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విజయ లక్ష్మి అన్నారు. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరవహిస్తున్న అన్న దాన కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన 155వ వారం అన్న ప్రసాద కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి హోప్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ తో కలిసి ప్రజలకు వడ్డించారు. ఈ సందర్బంగా విజయ లక్ష్మి మాట్లాడుతూ… కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి భోజనాలు చేయడం చేయాలా అరుదుగా జరుగుతుంది అన్నారు. భారీ వర్షంతో తడుస్తూనే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా హోప్ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకొని వారికి ఏలోటు లేకుండా చేసుకోవటం గొప్ప విషయమని తెలిపారు. అనేక సేవకార్యక్రమలు చేస్తున్న హోప్ ఫౌండేషన్ చర్మన్ తో పాటు సభ్యులను విజయ లక్మి అభినందించారు…ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
