
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయ చైర్మన్ నూతనంగా వచ్చిన శాయంపేట ఎస్ఐ ప్రమోద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మండల శాంతి భద్రతలు పరిరక్షణకై అహర్నిశలు శ్రమించడానికి కృషి చేస్తానని 100 డయల్ వాహనము ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని ఎస్ఐ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మచ్చ గిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి దేవాలయ సభ్యులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.