
వెల్దండ /నేటి ధాత్రి.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని రాచూరు గ్రామం నుండి వెల్దండ మండల కేంద్రానికి 7 కిలోమీటరు మట్టి రోడ్డు ఉంది. మట్టి రోడ్డుతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వెల్దండ మండల కేంద్రం నుండి రాచూరు గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేస్తూ.. మంగళవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. రాచూరు గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేసిన సందర్భంగా.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నివాసంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు గున్నెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. గజమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలలో సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు
రమేష్, శ్రీనివాస్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.