తెలంగాణ ఉద్యమ పోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ ఎస్.కె చాంద్
రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా
రామన్నపేట పట్టణానికి చెందిన దాసరి రజని రెక్క ఆడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం పదేళ్ల క్రితం తండ్రిని కోల్పోయినారు నలుగురు కుమార్తెలలో మూడవ కుమార్తె దాసరి రజని తన తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీ పూర్తి చేసి పట్టుదలతో చదివి కానిస్టేబుల్ పరీక్ష రాశారు ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ తుది ఫలితాలలో టీఎస్ ఎస్పీ కానిస్టేబుల్ గా అర్హత సాధించారు ఈ సందర్భంగా హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె చాంద్ శాలువాతో సత్కరించారు తన వంతుగా ఆర్థిక సహాయం అందచేశారు అనంతరం మాట్లాడుతూ పేదరికం చదువుకు అడ్డు కాదని దాసరి రజిని నిరూపించారని మహిళలు స్వాశక్తితో ఎదగాలని వారన్నారు ఈ కార్యక్రమంలో బెడద లింగస్వామి, పెండెం రవి ,గుండ్లపల్లి బాలయ్య ,ఎండి లతీఫ్, మాండ్ర రామచంద్రం ,ఆళ్ల బాలకృష్ణ, ఎం డి యాకూబ్ ,ఎస్ శ్రీనివాస్ ,దండిగ నరసింహ తదితరులు పాల్గొన్నారు