తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో గ్రామపంచాయతీ పాలకవర్గం ముగిసిన సందర్భంగా ఇందిరమ్మ కాలనీ పద్మశాలి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మరియు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ ప్రజలు ఐదు సంవత్సరములు అవకాశం ఇచ్చారని ఇందిరమ్మ కాలనీ ప్రజలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ప్రజల ఆశీర్వాదంతో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుందామని ఇందిరమ్మ కాలనీ ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
పద్మశాలి కమిటీ ఆధ్వర్యంలో సన్మానం
