
గొల్లపల్లి నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల తహసిల్దార్ జమీర్ ,గొల్లపల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ చిర్ర సతీష్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బీసీ విద్యార్థి సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్ ఆధ్వర్యంలో తహసిల్దార్,ఎస్సైను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి,శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్,బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు, కుమ్మరి సంగం అధ్యక్షులు సిరికొండ తిరుపతి,బీసీ సేన మండల అధ్యక్షులు రాజేష్,విద్యార్థి సంఘం పట్టణ అధ్యక్షులు తాడురి సంజయ్,నాయకులు వేల్పుల బన్నీ,బొడ్ల గంగాధర్ ,శశి,విలసగరం వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.