ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:
ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించి కానిస్టేబుల్ ఫలితాలలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామానికి చెందిన సూర సుమంత్ రెడ్డి సివిల్ పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికవగా పోత్కపల్లి దుర్గాభవాని కమిటీ ఆధ్వర్యంలో సుమంత్ రెడ్డికి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దుర్గా భవాని కమిటీ అధ్యక్షులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ సుమంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి మాతో కలిసి చదువుకొని,ఎంతో కష్టపడి సివిల్ కానిస్టేబుల్ గా ఎంపిక అవడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో మరెన్నో సేవలు చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల తిరుపతిరెడ్డి , తిరుపతి రెడ్డి, పాల్గొన్నారుపాల్గొన్నారు.